Delhi Stapede: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా రేపింది. ఈ తొక్కిసలాటలో లో 18 మంది మృతి చెందగా, సుమారు 25 మంది వరకు క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయాలపాలైన వారికి కూడా పరిహారం చెల్లించనున్నట్టు ప్రకటించింది.
Delhi Stapede: ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అదే విధంగా తీవ్రగాయాలపాలైన వారికి రూ.2.50 లక్షల చొప్పున, స్వల్పగాయాలపాలైన వారికి రూ.1 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొక్కిసలాటలో చనిపోయిన 18 మందిలో 14 మంది మహిళలే ఉన్నారు. గాయాలపాలైన 25 మందికి ఢిల్లీ నగరంలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్‌లో చికిత్స అందజేస్తున్నారు.
Delhi Stapede: ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రధాని ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అమిత్ షా, రాజ్‌నాధ్‌సింగ్, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తదితరులు కూడా తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు.