Delhi

Delhi: ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..

Delhi: దేశరాజధాని ఢిల్లీలోని పలు పాఠశాలలకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. డిసెంబర్ 9వ తేదీనే నగరంలోని 44 బడులకు బాంబు బెదిరింపు మెయిల్స్ రాగా… తాజాగా 6 పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఐదు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు బాంబు బెదిరింపులు రావడంతో.. అప్రమత్తమైన పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తరగతులను కూడా నిలిపివేశారు.

ఢిల్లీలోని పశ్చిమ విహార్‌లోని భట్నాగర్ ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, శ్రీనివాసపురిలోని కేంబ్రిడ్జ్ పాఠశాలకు, తూర్పు కైలాష్‌లోని DSP అమర్ కాలనీలోని పాఠశాలలతో పాటు మరో రెండు బడులకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. భట్నాగర్ ఇంటర్నేషనల్ స్కూలుకు ఉదయం 4.21 గంటలకు, కేంబ్రిడ్జ్ పాఠశాలకు 6.23 గంటలకు, డీఎస్పీ అమర్ కాలనీకి ఉదయం 6.35కి బాంబు బెదిరింపులతో కూడిన మెయిల్స్ రాగా.. వెంటనే యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాధిత బడుల వద్దకు చేరుకున్నారు.

Delhi: అగ్నిమాపక సిబ్బందితో పాటు బాంబు నిర్వీర్య దళాలను తీసుకుని పాఠశాలల్లో తనిఖీలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పాఠశాలలోనూ పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అటు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, పోలీసులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ వారం రోజుల్లోనే ఇలా 2 సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో.. ఇదంతా ఎవరు చేస్తున్నారని తెలుసుకునేందుకు పోలీసులు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, మెయిల్ ఐపీ అడ్రస్ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

బాంబు బెదిరింపులతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. పిల్లలను బడులకు పంపేందుకే వణికిపోతున్నారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందంటూ పోలీసులకు ఫోన్ చేస్తూ పదే పదే ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ 9వ తేదీనే ఢిల్లీలోని 44 విద్యా సంస్థల్లో బాంబులు పెట్టిన మెయిల్స్ వచ్చాయి. ముఖ్యంగా బడుల్లో పెట్టిన బాంబులు చాలా చిన్నవి అని వాటి వల్ల భవనాలు కూలిపోకపోయినా.. ఎక్కువ మంది గాయాల పాలవుతారంటూ ఆ మెయిల్స్‌లో రాసుకొచ్చారు. అలాగే బాంబులను నిర్వీర్యం చేయాలంటే 30 వేల డాలర్లు కావాలంటూ ఆగంతకులు బెదిరించారు.

Delhi: బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు బడులు ఆపేసి మరీ తనిఖీలు చేపట్టారు. అప్పుడు కూడా ఏ ఒక్క పాఠశాలలోనూ పేలుడు పదార్థాలు దొరకలేదు. ఇక ఇప్పుడు రెండోసారి రావడంతో మరింత అప్రమత్తమయ్యారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకునేందుకు చాలా కష్టపడుతున్నారు.

ALSO READ  Crime News: ఆస్పత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *