Delhi: మోదీని కలిసిన రామ్ చరణ్ కపుల్స్.. ఎందుకంటే..

Delhi: టాలీవుడ్ అగ్రహీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఆయన భార్య ఉపాసన కొణిదెల శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని భేటీ అయ్యారు. ఇటీవల ప్రారంభించిన ఆర్చరీ (విలువిద్య) లీగ్ విజయవంతమైన నేపథ్యంలో రామ్ చరణ్ ఈ సమావేశాన్ని జరిపినట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

ఈ సమావేశంలో రామ్ చరణ్ ప్రధానికి ఆర్చరీ లీగ్ గురించిన వివరాలు చెప్పారు. ఈ లీగ్ ద్వారా భారతదేశంలో విలువిద్యకు పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలని, క్రీడను యువతలో మరింత ప్రాచుర్యం పొందేలా చేయాలని ఉద్దేశ్యమని ఆయన వివరించారు. దేశీయ క్రీడలను ప్రోత్సహించడం, యువతను ఆకట్టుకోవడం వంటి అంశాలపై ప్రధాని మోదీతో చర్చలు జరగినట్లు సమాచారం. ఫొటోలలో చరణ్, ఉపాసన దంపతులు ఉత్సాహంగా ప్రధానితో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధనుస్సు చేతబట్టారు.

2025లో తొలిసారిగా ఢిల్లీలో ఐపీఎల్, ప్రో కబడ్డీ లీగ్‌ల తరహాలో ప్రత్యేకంగా ఆర్చరీ లీగ్ నిర్వహించబడింది. ఈ టోర్నమెంట్‌లో తెలంగాణ, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ సహా ఆరు రాష్ట్రాల జట్లు పోటీపడ్డాయి. దేశీయ క్రీడలను ప్రోత్సహించడంలో రామ్ చరణ్ ముందుకు రావడం, ఈ లీగ్‌కు విశేష ఆదరణ లభించడం విశేషం.

విజయవంతమైన ఆర్చరీ లీగ్ గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లడం ద్వారా విలువిద్యకి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించనుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *