Delhi: ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి పదవికి సీపీ రాధాకృష్ణన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సీపీ రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు. గతంలో ఆయన కోయంబత్తూరు ఎంపీగా పనిచేశారు. అలాగే తమిళనాడు BJP అధ్యక్షుడుగా కూడా సేవలందించారు.
ఆయన కొంతకాలం తెలంగాణ గవర్నర్గా కూడా పనిచేశారు.
రాబోయే సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.