Delhi: ఒలింపిక్ హీరో నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా

Delhi: జావెలిన్ స్టార్, రెండు ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రాకు భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. ఈ లాంఛనం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా, ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ప్రత్యేక కార్యక్రమంలో అందజేయబడింది. కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఉన్నతాధికారులు, నీరజ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, “నీరజ్ చోప్రా పట్టుదల, దేశభక్తి, క్రీడారంగంలో సాధించిన విజయాలు దేశానికి గర్వకారణం. ఆయన క్రీడాకారులకు, సైనిక దళాలకు స్ఫూర్తిగా నిలుస్తారు” అని అన్నారు.

నీరజ్ 2016 ఆగస్టులో రాజ్‌పుతానా రైఫల్స్ల నాయబ్ సుబేదార్‌గా చేరి, క్రీడల్లో రాణిస్తూ దేశానికి సేవ చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, పారిస్ 2024లో రజతం, ప్రపంచ అథ్లెటిక్స్, ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించారు.

అయితే, ఈ గౌరవ హోదాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఏడాది ఏప్రిల్ 16న ఆమోదించారు. దీనికి ముందే నీరజ్ పద్మశ్రీ, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు, పరమ విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకాలు వంటి సైనిక మరియు క్రీడా పురస్కారాలను పొందారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *