Delhi: ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు ఆతిషి ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె కొత్త భాద్యతల్లో ఢిల్లీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై దృష్టి సారించనున్నట్టు స్పష్టం చేశారు.
ఆతిషి మాట్లాడుతూ, “ప్రజా ప్రయోజనాలను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం. ఢిల్లీ ప్రజల హక్కులను రక్షించేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టేందుకు కృషి చేస్తాను” అని తెలిపారు. ఆమె కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా భాజపాపై విమర్శలు గుప్పిస్తూ, “ప్రజా సంక్షేమ పథకాలనుఅడ్డుకోవడానికి రాజకీయ కుట్రలు చేస్తున్నాయి. అయితే,మేము ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం” అని అన్నారు.
ఆమె ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టడంతో, ఢిల్లీలో
రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశముంది. భాజపా,కాంగ్రెస్ పార్టీలు ఆమె నేతృత్వాన్ని ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.