Arvind Kejriwal: ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ ఎల్జీ వినయ్ సక్సేనా కూడా కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగులను ప్రాసిక్యూట్ చేయాలంటే ఇలా చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పడంతో ఈడీ అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. గత ఏడాది పీఎంఎల్ఏ కోర్టులో కేజ్రీవాల్‌పై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో కేజ్రీవాల్‌ను లిక్కర్ పాలసీ స్కామ్‌లో నిందితుడిగా చేర్చారు.
ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈడీ ఈ ఆమోదం పొందింది. ఫలితాలు ఫిబ్రవరి 8న వస్తాయి.
మద్యం పాలసీ వ్యవహారంలో కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు జనవరి 11న ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ఈడీకి అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 5న కేజ్రీవాల్‌పై విచారణ జరిపేందుకు ఎల్జీ అనుమతిని ఈడీ కోరింది.


