Delhi: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్‌రెడ్డిను ఖరారు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
న్యాయవ్యవస్థలో విశిష్టమైన సేవలందించిన సుదర్శన్‌రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జిగా సుమారు నాలుగున్నరేళ్లు పనిచేశారు. ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం గ్రామం.
ఇండియా కూటమి నిర్ణయంతో తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవేత్త దేశ అత్యున్నత పదవికి పోటీ పడుతున్నందుకు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.