Delhi: పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా తీసుకున్న బనకచర్ల పైపులైన్ పనులు ఇంకా ప్రారంభం కాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వం లో స్పష్టం చేసింది. బనకచర్ల ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక అంచనాల కోసం అవసరమైన ప్రక్రియను కేంద్రం అనుసరిస్తోందని పేర్కొంది.
ఈ ప్రాజెక్టు విషయంలో పరీవాహక రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ అడిగిన ప్రశ్నకు స్పందనగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానాన్ని ఇచ్చింది.
ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రక్రియలు పటిష్టంగా, సమగ్రంగా సాగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
