Lalu Prasad Yadav: బిహార్ ఎన్నికలకు ముందు రాష్ట్రీయ జనతాదళ్ అధినేత…., కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. IRCTC కుంభకోణంలో సీబీఐ దాఖలుచేసిన ఛార్జిషీట్ మేరకు అవినీతి నిరోధక చట్టం కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది. లాలూ ప్రసాద్ తో పాటు….. ఆయన భార్య మాజీ CM రబ్రీ దేవీ, వారి కుమారుడు తేజస్వీ యాదవ్ పై అవినీతి, నేరపూరితమైన కుట్ర, మోసం అభియోగాలను మోపింది.
ఇది కూడా చదవండి: Maganti Sunitha: జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ అభ్యర్థిపై కేసు నమోదు
భారతీయ రైల్వేకు చెందిన రెండు BNR హోటళ్లను ముందుగా IRCTCకి బదిలీ చేసి, వాటి నిర్వహణ కాంట్రాక్టులను బిహార్ లోని సుజాత హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించారని ఛార్జిషీట్ లో CBI తెలిపింది. ఈ క్రమంలో టెండర్ల ప్రక్రియను తారుమారు చేసి ఆ ప్రైవేట్ సంస్థకు.. సహాయం చేశారని ఆరోపించింది. ఆ రెండు హోటళ్లు ఒకటి రాంచీలో ఉండగా, మరొకటి పూరీలో ఉందని ఈ వ్యవహారం 2004 నుంచి 2014 మధ్య జరిగిందని తెలిపింది. త్వరలో బిహార్ ఎన్నికలు జరగనున్న వేళ… లాలూ కుటుంబంపై న్యాయస్థానం అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేయడం ఆర్జేడీకి పెద్ద షాక్ గా మారింది.