Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేహాబాద్ ప్రాంతంలో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం రోడ్ ఆక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు మరియు వారి ఇద్దరు పిల్లలు మరణించారు.
పోలీస్ తెలిపిన సమాచారం ప్రకారం.. మరణించినవారు ఓంప్రకాష్ సింగ్ (42),అతని భార్య పూర్ణిమ (34), కుమార్తె అహానా (12),కుమారుడు వినాయక్(4) గా గుర్తించారు.. ఈ ప్రమాదంలో అందరూ అక్కడికి అక్కడే మృతి చెందారు.
ఈ కుటుంబం బీహార్‌లోని మోతిహరి జిల్లాకు చెందినవారు.
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal: ఢిల్లీ ప్రజలను చంపేస్తారా? బీజేపీపై కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు.. ఈసీ సీరియస్!
వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమర్‌దీప్ తెలిపారు.
సింగ్ కారుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. “డ్రైవర్ నిద్రమత్తులో ప్రమాదానికి దారితీసిందని ప్రాథమిక దర్యాప్తు సూచిస్తుంది” అని అధికారి తెలిపారు.
కారు అదుపు తప్పి ఎక్స్‌ప్రెస్‌వేకు ఎదురుగా వస్తున్న మినీ ట్రక్కును ఢీకొట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కారు తీవ్రంగా ధ్వంసమై నలుగురూ ప్రాణాపాయ స్థితిలో మృతి చెందారు.
ఆగ్రాలోని ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో పడి ఉన్న మృతదేహాలను బయటకు తీశారు.

