Delhi: తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కేంద్ర పర్యాటక, పట్టణాభివృద్ధి మరియు రవాణా శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీ హెచ్.డి. కుమారస్వామిని ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు అవసరాలపై ప్రధానంగా చర్చించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర పౌరులకు మరింత మెరుగైన, పర్యావరణ హితం కలిగిన రవాణా సదుపాయాలు కల్పించాలనే దృష్టితో 800 ఎలక్ట్రిక్ బస్సులను (EV Buses) కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈవీ బస్సుల అవసరం అత్యంత కీలకమని వివరించారు.
హైబ్రిడ్ జీసీసీ (GCC) మోడల్‌ను పరిగణనలోకి తీసుకోండి
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, ఈవీ బస్సుల నిర్వహణకు సంబంధించి హైబ్రిడ్ జీయస్సీ మోడల్ (Gross Cost Contract) పద్ధతిని రాష్ట్రానికి అనుకూలంగా కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ మోడల్ ద్వారా ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వానికి ఖర్చు తగ్గించి సేవల పరంగా మెరుగైన ఫలితాలు తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
డీజిల్ బస్సులకు రిట్రో ఫిట్‌మెంట్ అవకాశం ఇవ్వండి
ఇప్పటికే రాష్ట్ర రహదారి రవాణా సస్థ (RTC) ఆధీనంలో ఉన్న డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించకుండా, వాటికి రిట్రో ఫిట్‌మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్ ఏర్పాటు చేసే అవకాశాన్ని కేంద్రం అనుమతించాలని సీఎం వినతి తెలిపారు. దీనివల్ల ఖర్చు తగ్గడం తో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని చెప్పారు.
కేంద్ర మంత్రి కుమారస్వామి సీఎం రేవంత్ వినతులను సానుకూలంగా స్వీకరించి, కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

