Crime News: ఒకపక్క పూణెలో ఇంజనీర్ ఆత్మహత్య వార్త మరువకముందే… ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ధీరజ్ కన్సల్ హీలియం గ్యాస్ పీల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
హోటల్ గదిలో విగతజీవిగా
ధీరజ్.. ఢిల్లీ గోల్ మార్కెట్ సమీపంలోని బెంగాలీ మార్కెట్‌లో ఉన్న ఓ గెస్ట్ హౌస్‌లో నివసిస్తున్నాడు. జూలై 28న అక్కడ రూమ్ తీసుకున్నాడు. మంగళవారం ఉదయం అలారం మోగించినా బయటకు రాకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు విరగబెట్టి లోపలికి వెళ్లిన పోలీసులు, మంచంపై అతను మరణించిన స్థితిలో ఉన్నాడని తెలిపారు. హీలియం గ్యాస్ సిలిండర్, మూడు ప్లాస్టిక్ పైపులు అక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు.
సూసైడ్ నోట్ – హృదయాన్ని తాకే మాటలు
ధీరజ్.. తన మరణానికి ఎవరూ కారణం కాదని స్పష్టంగా చెప్పాడు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం అని చెప్పాడు. ఫేస్‌బుక్‌లోనూ, ఒక లేఖలోనూ తన భావాలను వెల్లడించాడు.
అతని మాటల్లో: “నా జననం – నా జీవితంలో దుఃఖకరమైన ఘట్టం… కానీ నా మరణం – అందమైన ఘట్టం. నేను ఎవరితోనూ బంధం పెంచుకోలేకపోయాను. ఎవ్వరినీ నిందించొద్దు, నా డబ్బు అనాథాశ్రమానికి లేదా వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వండి. నా అవయవాలను దానం చేయండి.”
ఇది కూడా చదవండి: Prakash Raj: బెట్టింగ్ యాప్‌ల కేసు: ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాష్‌రాజ్
చిన్నప్పటి నుంచి ఒంటరితనమే
ధీరజ్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు (2002లో). ఆ తర్వాత తల్లి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుంచి తాత, మామ దగ్గరే పెరిగాడు. తల్లి ప్రేమ అందకపోవడంతో అతను మానసికంగా చాలా ఒంటరిగా మారాడు. ఎలాంటి తోబుట్టువులు లేని ధీరజ్ తన భావాలను ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉండిపోయాడు.
హీలియం గ్యాస్… ప్రాణాలపై ప్రభావం
హీలియం గ్యాస్ ఎక్కువగా పీల్చితే శరీరంలో ఆక్సిజన్ తగ్గుతుంది. ఇది బ్రెయిన్‌కు ఆక్సిజన్ అందకపోవడంతో మరణానికి దారి తీస్తుంది. ఢిల్లీలో హీలియం ద్వారా జరిగిన తొలి ఆత్మహత్య ఇదేనని పోలీసులు తెలిపారు.ఈ గ్యాస్‌ను ధీరజ్ గజియాబాద్‌లోని ఓ ఈ-కామర్స్ వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

