Delhi: రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ 

Delhi: దేశవ్యాప్తంగా ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లను వచ్చే ఏడాది మార్చి నాటికి దశలవారీగా రద్దు చేయనున్నారని కొన్ని సోషల్ మీడియా వేదికలపై, ముఖ్యంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ప్రజల్లో ఆందోళన తలెత్తడంతో, కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కు చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారాన్ని పూర్తిగా అవాస్తవమైనదిగా ఖండించింది. ఈ ప్రచారం పూర్తి నిరాధారమైనదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటువంటి ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది.

ఈ నకిలీ వార్తలపై ప్రజలను హెచ్చరిస్తూ, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తన అధికారిక ‘X’ (మాజీ Twitter) ఖాతాలో ఓ పోస్టు చేసింది. అందులో, “రూ.500 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. వాటిని నిలిపివేసే విషయంపై RBI నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు” అని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఒక విజ్ఞప్తి చేసింది – సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకండని, వాటిని షేర్ చేయకండని కోరింది. ఏదైనా వార్తను నమ్మే ముందు, లేదా పంచుకునే ముందు, దాని యథార్థతను అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని హితవు పలకింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *