WPL 2025

WPL 2025: లో దిల్లీ రెండో విజయం..! యూపీ కొంపముంచిన క్యాచ్ డ్రాప్

WPL 2025: ఈ సారి మహిళల ప్రీమియర్ లీగ్ లో వరుసగా మ్యాచ్‌లు లక్ష్యాన్ని చేదిస్తున్న జట్లు మాత్రమే విజయం సాధిస్తున్నాయనే విషయం తెలిసిందే. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ, నిన్న జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ విజయంతో ఈ సీజన్‌లో వారి రెండవ విజయాన్ని నమోదు చేసుకున్నారు. వడోదరా వేదికపై జరిగిన ఈ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. అనాబెల్ సదర్లాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన దిల్లీకి ఈ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది.

167 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ క్యాపిటల్స్ సులభంగా చేధించింది. మొదటగా కెప్టెన్ మెగ్ లానింగ్ 49 బంతుల్లో 12 ఫోర్లతో 69 పరుగులు చేసి అచ్యుత్తమ ఇన్నింగ్స్ ఆడింది. ఆ తర్వాత అనాబెల్ సదర్లాండ్ 35 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు చేసి చివరి వరకు ఉండగా ఆమెకు తోడుగా మరిజేన్ కాప్ ఎంతో ధాటిగా ఆడి 17 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.

వీరి ప్రదర్శన ఫలితంగా, దిల్లీ 19.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. షెఫాలి వర్మ కూడా 16 బంతుల్లో 3 ఫోర్లు మరియు 1 సిక్స్‌తో 26 పరుగులు ఎంతో వేగంగా సాధించి కీలకమైన ఇన్నింగ్స్ ఆడింది. అయితే దిల్లీ ఇన్నింగ్స్ మధ్యలో యూపీ బౌలర్లు కొంతవరకు పరుగులను నియంత్రించారు. అయినప్పటికీ, దిల్లీ బ్యాటర్లు సమర్థవంతంగా ఆడి స్కోరును ముందుకు తీసుకువెళ్లారు. దిల్లీ 29 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన సమయంలో, అనాబెల్ సదర్లాండ్ క్యాచ్‌ను ఎకిల్‌స్టోన్ జారవించడంతో మ్యాచ్‌లో మలుపు తిరిగింది.

ఇది కూడా చదవండి: PAK vs NZ: తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌‌ ఘోర ఓటమి.. సెమీస్ ఆశలు క్లిష్టం

చివరి దశలో కూడా యూపీ ఒక క్యాచ్ మరియు ఒక రన్‌అవుట్ అవకాశాన్ని కోల్పోయింది…. ఇక ఇది దిల్లీకి ప్రయోజనం చేకూర్చింది. యూపీ వారియర్స్ బౌలర్లలో గ్రేస్ హారిస్ మరియు దీప్తి శర్మ బౌలింగ్ లో మంచి ప్రదర్శన ఇచ్చినప్పటికీ మిగతా బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో వారు ఓటమిపాలు కాక తప్పలేదు.

అంతకు ముందు, యూపీ బ్యాటింగ్‌లో ఓపెనర్ కిరణ్ నవ్‌గిరె 27 బంతుల్లో 6 ఫోర్లు మరియు 3 సిక్స్‌లతో 51 పరుగులు చేసి రెచ్చిపోయింది. పవర్ ప్లే లో ఆమె చేసిన వీర విహారం అంతా అంతా కాదు. ఢిల్లీ బోనాలపై వరుసగా ఫోర్లో సిక్సర్లతో రెచ్చిపోయింది.

ALSO READ  Game Changer Song: 'గేమ్ ఛేంజర్' నుంచి నానా హైరానా మెలోడీ

ఇక మిడిల్ ఆర్డర్ లో శ్వేత సెహ్రావత్ 33 బంతుల్లో 4 ఫోర్లు మరియు 1 సిక్స్‌తో 37 పరుగులు చేయగా చివరి ఓవర్లలో హెన్రీ (15 బంతుల్లో 3 ఫోర్లు మరియు 3 సిక్స్‌లతో 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. దిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 2 వికెట్లు తీసుకున్నారు. అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచిన సదర్లాండ్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *