Delhi:

Delhi: ఢిల్లీలో స్కూళ్ల‌కు మ‌ళ్లీ బాంబు బెదిరింపు

Delhi: దేశ రాజ‌ధాని న‌గ‌రంలోని స్కూళ్ల‌కు బాంబు బెదిరింపు కాల్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయి. వ‌రుస ఫోన్ కాల్స్‌తో స్కూళ్ల యాజ‌మాన్యాలు, విద్యార్థులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. ప్ర‌భుత్వానికి కూడా త‌ల‌నొప్పిగా మారింది. ఏ స‌మ‌యంలో ఎటు నుంచి కాల్ వ‌స్తున్న‌దో, ఎక్క‌డ నిజంగా బాంబు ఉన్న‌దో తెలుసుకునేందుకు తంటాలు ప‌డుతున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క స్కూల్‌లో కూడా బాంబు ఉన్న‌ట్టు నిర్ధార‌ణ కాక‌పోయినా, ఒక్క చోట బాంబు దాడి జ‌రిగినా తీర‌ని న‌ష్టం వాటిల్లే ప్ర‌మాద‌ముంద‌ని అంద‌రిలోనూ ఆందోళ‌న నెల‌కొన్న‌ది.

Delhi: తాజాగా ఢిల్లీ న‌గ‌రంలోని ఆర్కే పురంలోని ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌కు ఈ రోజు ఉద‌యం 6.09 గంట‌ల‌కు బాంబు ఉన్న‌ట్టు మెయిల్ రావ‌డంతో స్కూల్ యాజ‌మాన్యం అప్ర‌మ‌త్త‌మైంది. పోలీసులు, ఫైర్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. సెక్యూరిటీ త‌నిఖీల్లో ఎలాంటి పేలుడు ప‌దార్థాలు లేవ‌ని తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయినా విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల్లోనూ ఆందోళ‌న నెల‌కొన్న‌ది.

Delhi: ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ న‌గ‌రంలో 40 స్కూళ్ల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ఆయా స్కూళ్ల‌లో మ‌ళ్లీ ఎప్పుడైనా ప్ర‌మాదం ముంచుకొస్తుందేమోన‌ని అటు విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *