Delhi: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే టీ. రాజాసింగ్ రాజీనామాను పార్టీ అధిష్ఠానం ఆమోదించింది. జూన్ 30న ఆయన తన రాజీనామా లేఖను పంపగా, తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ఆమోదం తెలిపారు.
రాజీనామా వెనుక ప్రధాన కారణంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో పని చేసిన నేతలకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంపై ఆయన అభ్యంతరం తెలిపారు.
ఇప్పుడైతే బీజేపీ అధిష్ఠానం రాజీనామాను ఆమోదించడంతో, రాజాసింగ్ భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై ఉత్కంఠ నెలకొంది. ఆయన మరో పార్టీకి చేరతారా? లేక స్వతంత్రంగా పోటీచేస్తారా? అనే చర్చలు పార్టీలో మొదలయ్యాయి.
