Delhi: ఆధార్‌తో ఓటరు కార్డు లింకింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం తాజా సమావేశం

Delhi: ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపింది. ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, అలాగే సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

త్వరలో ఆధార్, ఓటరు కార్డు అనుసంధానంపై సాంకేతిక నిపుణుల సంప్రదింపుల కమిటీ సమావేశం కానుంది. ఈ క్రమంలో, నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శి, అలాగే ఆధార్, ఓటరు కార్డులపై పనిచేసే సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

ఈ నిర్ణయం ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మార్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇది ఎంతవరకు ప్రయోజనకరమో, వ్యక్తిగత గోప్యత అంశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరంఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *