Delhi: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోమవారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ఆయనతో పాటు మరో ఇద్దరికి కీలక పదవులు లభించాయి. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ ఆషింకుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా నియమితులయ్యారు. ఈ తాజా నియామకాలు తక్షణమే అమలులోకి రానున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది.
విజయనగరానికి చెందిన అశోక్ గజపతిరాజు, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నేత. తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యవస్థలో కీలక స్థానాన్ని కలిగిన ఆయన, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా విశేష సేవలందించారు. గోవా గవర్నర్గా ఆయన నియామకాన్ని టీడీపీ వర్గాలు, అభిమానులు సంతోషంగా స్వీకరించారు.
Also Read: CM Chandrababu: అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదం: సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఇక హర్యానా గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించిన బండారు దత్తాత్రేయ స్థానంలో ప్రముఖ విద్యావేత్త ఆషింకుమార్ ఘోష్ నియమితులయ్యారు. విద్యారంగంలో ఘోష్ సేవలు ప్రశంసనీయం. అదే విధంగా, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా మాజీ జమ్ము అండ్ కాశ్మీర్ ఉపముఖ్యమంత్రి కవీందర్ గుప్తా నియమితులయ్యారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు దేశ వ్యాప్తంగా గవర్నర్ పదవుల్లో సేవలందిస్తున్న ఉదాహరణలు గణనీయంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 20 మందికి పైగా తెలుగువారు వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా నియమితులై, గొప్ప సేవలు అందించారు. వారిలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ప్రముఖులు కూడా ఉన్నారు.
