Ganesh Laddu: తెలంగాణ అంతా గణేశ్ నవరాత్రి ఉత్సాహంలో మునిగిపోయింది. ఎక్కడ చూసినా శోభాయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గణనాథుడి భక్తుల భజనలు మార్మోగుతున్నాయి. ఈ పండుగలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది లడ్డు వేలంపాట. బాలాపూర్, బండ్లగూడ, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ప్రతీ ఏడాది లడ్డు వేలం కోట్ల రూపాయల వరకు చేరుతుంది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలు పలకగా, రాజేంద్రనగర్ సన్ సిటీలోని రిచ్‌మండ్ విల్లా గణనాథుడి లడ్డూ ఏకంగా రూ.2.32 కోట్లకు అమ్ముడవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
కానీ, ఈసారి అన్ని దృష్టులను ఆకర్షించింది కొత్తపేట శ్రీ ఏకదంత యూత్ అసోసియేషన్ ప్రత్యేకంగా నిర్వహించిన లక్కీ డ్రా. ఇందులో కేవలం రూ.99తో 333 కిలోల భారీ లడ్డూను బీబీఏ విద్యార్థి సాక్షిత్ గౌడ్ గెలుచుకోవడం సంచలనంగా మారింది. మొత్తం 760 టోకెన్లు విక్రయించగా, అదృష్టం సాక్షిత్ వైపు చేరింది. సాధారణంగా కోట్లు, లక్షల రూపాయలకు దక్కే లడ్డు ఈసారి ఒక విద్యార్థికి తక్కువ మొత్తంలో దక్కడం సోషల్ మీడియాలో వైరల్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Temples Closed: భక్తులకు అలర్ట్! మధ్యాహ్నం నుండి అన్ని ఆలయాల మూసివేత
తెలంగాణలో వినాయక చవితి వేడుకలు ప్రతీ ఊరూరా భక్తిశ్రద్ధలతో జరుగుతాయి. పెద్ద చిన్న విగ్రహాలను ప్రతిష్టించి, శోభాయాత్రలు, నిమజ్జనాలతో నగరాలు రంగుల్తో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ తీర ప్రాంతం పండుగ వాతావరణంతో కాంతులీనుతోంది.
భక్తులు లడ్డూను కేవలం ప్రసాదంగా కాకుండా విజయానికి, అభివృద్ధికి, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. అందుకే బాలాపూర్ నుండి బండ్లగూడ, కూకట్‌పల్లి వరకు లడ్డు వేలాలు ప్రతీ ఏటా పోటీగా జరుగుతాయి. అయితే, ఈసారి కొత్తపేటలో లక్కీ డ్రా రూపంలో గెలిచిన లడ్డూ ఉత్సవాలకు కొత్త రుచిని తెచ్చింది.
హైదరాబాద్ కొత్తపేటలో ఓ విద్యార్థి 333 కేజీల గణేశ్ లడ్డూను లక్కీ డ్రాలో గెలిచి కేవలం ₹99కే దక్కించుకున్నాడు! #vinayakachavithi2025 #Viralnews pic.twitter.com/4jHLxkjY2W
— s5news (@s5newsoffical) September 7, 2025