Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల డిమాండ్‌తో డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేటి నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను కూడా బహిష్కరిస్తున్నట్టు చెప్పాయి. దీంతో ఉన్నత విద్యా మండలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రైవేటు డిగ్రీ పీజీ కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపారు.జరిగిన చర్చలు సఫలమయ్యాయని విద్యామండంలి వెల్లడించింది డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఉన్నత ప్రకటించింది.
నేటి నుంచి జరగాల్సిన డిగ్రీ 3, 5 సెమిస్టర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ తెలిపారు. ప్రభుత్వం రూ.2వేల కోట్లు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశాయి. గడిచిన రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్య సంఘాలు తెలిపాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ జిట్టా బాలకిష్టారెడ్డిని కలిశారు.

