Deepika Padukone: బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణె పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సారి కారణం సినిమా కాదు, ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్తో ఆమెకు ఉన్న పాత స్నేహబంధంలో చోటుచేసుకున్న పరిణామమే. దీపికా, ఫరా ఖాన్ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం బాలీవుడ్‌లో చర్చకు దారితీసింది.
ఈ పరిణామం వెనుక కారణం.. ఇటీవల ఒక టీవీ షోలో ఫరా ఖాన్ చేసిన సరదా వ్యాఖ్యలే అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ షోలో దీపికాను ఉద్దేశిస్తూ ఫరా ఖాన్, “ఆమె ఇప్పుడు పనిచేసేదే ఎనిమిది గంటలు. ఇక ఈ షోకు రావడానికి ఆమెకు అంత సమయం ఎక్కడ ఉంటుంది” అని ఫన్నీగా వ్యాఖ్యానించారు. ఫరా ఖాన్ సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చకు దారితీయడంతో, దీపికా ఆమెను అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా, ఫరా ఖాన్ కూడా దీపికాతో పాటు ఆమె భర్త, నటుడు రణ్‌వీర్ సింగ్‌ను కూడా అన్‌ఫాలో చేశారు.
Also Read: Samantha: ఆ టైంలో నాకు ఎవరూ ప్రేమ గురించి చెప్పలేదు.. సమంత ఎమోషనల్ పోస్ట్
దీపికా, ఫరా ఖాన్‌ల మధ్య దశాబ్దాలుగా స్నేహం ఉంది. ఫరా ఖాన్ దర్శకత్వం వహించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాతోనే దీపికా హీరోయిన్‌గా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఈ రెండు సినిమాలు వారి స్నేహాన్ని మరింత బలోపేతం చేశాయి. అలాంటి స్నేహితులు ఇప్పుడు ఒక చిన్న వ్యాఖ్య కారణంగా సోషల్ మీడియాలో దూరమవడం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
కాగా, దీపికా పదుకొణె గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ‘స్పిరిట్’, ‘కల్కి 2898 AD’ వంటి సినిమాల నుంచి తప్పించారనే వార్తలతోనూ, దర్శకుడు సందీప్ వంగా విమర్శలతోనూ వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో, ఫరా ఖాన్‌తో జరిగిన ఈ అన్‌ఫాలో డ్రామా ఆమె పేరును మరోసారి హాట్ టాపిక్‌గా మార్చింది.