Deepika Padukone

Deepika Padukone: బన్నీతో దీపికా రొమాన్స్?

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తెలుగు సినిమాల్లో సందడి చేస్తోంది. ‘కల్కి 2898 ఏడి’ చిత్రంలో ప్రభాస్ సరసన నటించి, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల తార.. ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కలయికలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమాలో దీపికా ఎంపికైనట్లు వార్తలు వచ్చినా, తాజాగా ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు సమాచారం.

అయినా, దీపికా ఊరకనే ఉంటుందా? ఇప్పుడు ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించే అవకాశం అందుకున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో నటీనటుల ఎంపిక జోరుగా సాగుతోంది. ఒక సినిమా కాకపోతే మరో సినిమాలో దీపికా ఖచ్చితంగా కనిపిస్తుందని అభిమానులు ఉత్సాహంగా చర్చించుకుంటున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే, అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: పవర్ స్టార్ తో అకిరా.. కిర్రాక్ లుక్.. నెట్టింటా వైరల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *