Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పనిగంటలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కల్కి-2, స్పిరిట్ సినిమాల నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఆమె మాటలు ప్రభాస్ అభిమానులను కోపంతో రెచ్చగొట్టాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Akhil Akkineni: లెనిన్ క్లైమాక్స్ కోసం అఖిల్ స్పెషల్ ట్రైనింగ్?
దీపికా పదుకొణె కల్కి-2, స్పిరిట్ సినిమాల నుంచి పనిగంటల వివాదంతో తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పనిగంటలపై మళ్లీ మాట్లాడారు. “రోజుకు 8 గంటలకు మించి పనిచేయడం ఆరోగ్యానికి హానికరం. అధిక శ్రమే నిబద్ధత కాదు” అని దీపికా అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “షారుఖ్ సినిమాకు 8 గంటలే పనిచేస్తున్నావా?” అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, కుటుంబం-అభిమానుల మద్దతే తనకు బలమని దీపికా పేర్కొన్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో కింగ్ సినిమాలో నటిస్తున్న ఆమెపై ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఇంకా కొనసాగుతోంది.
