Spirit Movie

Spirit Movie: ప్రభాస్ సినిమా నుండి దీపిక ఔట్.. రూ. 16 కోట్ల లాభం

Spirit Movie: సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయింది త్రిప్తి దిమ్రీ. ఈ మూవీ సక్సెస్ తో ఇప్పుడు ధడక్‌లో సిద్ధాంత్ చతుర్వేది, స్పిరిట్‌లో ప్రభాస్ సరసన నటిస్తుంది. విశేషమేమిటంటే స్పిరిట్ సినిమా కోసం ముందుగా దీపికా పదుకొనేను అనుకోగా ఆమె స్థానంలో త్రిప్తి దిమ్రీని తీసుకున్నారు. దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పు్కోవడానికి కారణం సందీప్ రెడ్డి వంగాతో ఉన్న అనేక వివాదాలుతో పాటుగా దీపిక రూ.20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసిందని సమాచారం.

అంతేకాకుండా ఆమె సినిమా లాభాల్లో వాటా, తెలుగు డైలాగులు చెప్పడానికి నిరాకరించడం వంటి ఇతర షరతులు కూడా పెట్టిన్నట్లు తెలుస్తోంది దీపికతో పోలిస్తే స్పిరిట్ చిత్రానికి త్రిప్తి దిమ్రీ రెమ్యూనరేషన్ చాలా తక్కువ. త్రిప్తి దిమ్రీకి ఈ సినిమా కోసం రూ.4 కోట్లు తీసుకుంటుంది. అంటే ఇది దీపికా పదుకొనే రెమ్యూనరేషన్ కంటే 75 శాతం తక్కువ.

దీపిక సినిమా నుండి తప్పుకోవడం వలన చిత్ర బృందానికి దాదాపు 16 కోట్ల రూపాయలు మిగిలిందని తెలుస్తోంది. ఇన్నేళ్ల కెరీర్లో ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో అమితాసక్తి కలుగుతోంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Siva Shakthi Datta: కీర‌వాణి ఇంట తీవ్ర విషాదం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *