Deepam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో దీపం 2.0 పథకం ఒకటి. ఈ పథకాన్ని గత ఏడాది నవంబర్ 1న ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు నాలుగు నెలలకో సిలిండర్ చొప్పున ప్రభుత్వం ఉచితంగా అందించనున్నది. ఈ పథకాన్ని రాయితీ కింద ఏటా 2,684 కోట్లు ఖర్చవుతుందని ఆనాడే అంచనా వేసింది. ఆ మేరకు తాజా బడ్జెట్‌లో రూ.2,601 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది.
Deepam: ఒక్కో సిలిండర్ ధరకు కేంద్రం రాయితీ పోను, మిగతా నగదును సిలిండర్ అందిన 48 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సంస్థల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నది. ఈ పథకం కింద ఏటా లబ్ధిదారుల కుటుంబాలకు సుమారు రూ.2,500కు పైగా నగదు ఆదా అవుతుంది. దీంతో తొలి నుంచి హామీల అమలు, సూపర్ సిక్స్ పథకాలను ఒక్కోటిగా అమలు చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం దీపం 2.0 పథకానికి ఏడాదికి సరిపడా నిధులు కేటాయించి, పేదింటి లబ్ధిదారులకు ఆసరాగా నిలువనున్నది.