DCM pawan Kalyan: పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మాటకు కట్టుబడి ఉన్నారని నిరూపించారు. చిలకలూరిపేటలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా శారదా హైస్కూల్‌కు సహకారం అందిస్తానని ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారు.
శారదా హైస్కూల్ లైబ్రరీకి అవసరమైన పుస్తకాలు, 25 కంప్యూటర్లు, కంప్యూటర్ ల్యాబ్‌కు అవసరమైన పరికరాలను పవన్ కల్యాణ్ అందజేశారు. విద్యార్థులకు ఆధునిక విద్యా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా స్కూల్‌లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. డిప్యూటీ సీఎం చేసిన ఈ సహాయంపై స్థానికులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
