DB Stock Broking Scam

DB Stock Broking Scam: హైదరాబాద్‌లో భారీ స్కాం.. రూ.7 వేల కోట్లతో పరారైన డీబీ బ్రోకింగ్ కంపెనీ చైర్మన్

DB Stock Broking Scam: రోజుకో కొత్త మోసాలు వెలుగుచూస్తున్నాయి. సామాన్యులే టార్గెట్‌గా కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ లాభాల ఆశచూపి…అసలుకే ఎసరు పెడుతున్నారు కొందరు మోసగాళ్లు. స్టాక్ బ్రోకింగ్ పేరుతో ఏకంగా ఏడువేల కోట్ల స్కాం బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోనే 20 మంది వరకు బాధితులు ఉండటంతోపాటు పలు ప్రధాన నగరాల్లోనూ డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీపై కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో రూ. 7,000 కోట్ల విలువైన స్టాక్‌బ్రోకింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. డిబి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తమను మోసం చేసిందంటూ సైబరాబాద్ లో ఫిర్యాదులు చేశారు. అధిక మొత్తంలో నష్టమోయామంటూ పెద్దమొత్తంలో ఫిర్యాదులు చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు.. డిపి స్ట్రాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్ తో పాటు పలువురుపై కేసులు నమోదు చేశారు. స్టాక్ బ్రోకింగ్ ద్వారా డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందాయి. కేవలం హైదరాబాదులోనే 20 వేల మంది డిబి స్టాక్ బ్రోకింగ్ బాధితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు షాక్ కు గురయ్యారు.

DB Stock Broking Scam: హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గౌహతి, నల్బరితో సహా ప్రధాన నగరాల్లో కార్యాలయాలను కలిగి ఉన్న డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన బాధితుల నుండి ఫిర్యాదులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్‌లోని పుప్పాలగూడ మణికొండకు చెందిన 37 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షమై పంచాక్షర్ అనే వ్యక్తి సెప్టెంబర్ 23న ఫిర్యాదు చేశాడు. అసోంలోని గౌహతికి చెందిన దీపాంకర్ బర్మన్‌కు చెందిన డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు లాభాలు, అసలు మొత్తం వడ్డీ చెల్లింపులు కూడా తిరిగి చెల్లించలేదు దీనిపై పంచాక్షర్ కేసు నమోదు చేశారు.

2018లో DB స్టాక్ బ్రోకింగ్ పెట్టుబడులు ప్రారంభించింది. అధిక వడ్డీ రాబడితో పథకాలను అందించడం ద్వారా వేలాది మంది కస్టమర్లను ఆకర్షించింది. వీటిలో 120% వడ్డీని అందించే వార్షిక ప్లాన్, 54% అందించే సెమీ-వార్షిక ప్లాన్ మరియు 7% అందించే నెలవారీ ప్లాన్ వంటి ఎంపికలు ఉన్నాయి. అయితే, జూలై 2024 నుండి చెల్లింపులు ఆగిపోయాయని పెట్టుబడిదారులు వాపోయారు.

DB Stock Broking Scam: హైదరాబాద్‌లోని కెపిహెచ్‌బి కాలనీలో డిబి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా మంది స్థానిక ప్రజలు డిబి స్టాక్ బ్రోకింగ్ ను నమ్మి ఈ పథకంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. ఈ స్కామ్‌తో జగదీష్‌ అనే వ్యక్తి కూడా వున్నట్లు స్థానికులు తెలిపారు. లక్షల నుంచి కోట్ల వరకు నష్టపోయినట్లు వెల్లడిస్తూ బాధితులు ముందుకు వచ్చారు. ఈస్కామ్ లో విశ్వజిత్ సింగ్ కంపెనీలో రూ. 36.8 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అతనికి మొత్త పెట్టుబడి రాలేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో సహా ఇతర బాధితులు ఇంకా అధికారికంగా ఫిర్యాదులు చేయలేదు కానీ రాబోయే రోజుల్లో ముందుకు వస్తారని పోలీసులు భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *