Rajendra Prasad: రాబిన్ హుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో డేవిడ్ వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ ని బూతులు తిట్టారు. అయితే ఇవి రాజేంద్ర ప్రసాద్ సరదాగా అన్న మాటలు. కానీ ఆయన కామెంట్స్ ని డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ సరదాగా తీసుకోలేకపోతున్నారు. రాజేంద్ర ప్రసాద్‍పై డేవిడ్ వార్నర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో ప్రేమతో తెలుగు చిత్రంలో నటించిన అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ వార్నర్‌ను ఇలా తిట్టడం సరికాదంటూ విమర్శిస్తున్నారు. అతిథిలా అత్యంత గౌరవంగా చూసుకోవాల్సిన వార్నర్‌ను దూషించడం బాగోలేదంటూ ఫైర్ అవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి గొప్ప నటుడు ఇలా మాట్లాడడం సరికాదంటూ నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. ఎంత సరదా అయినా అంత పాపులర్ సెలెబ్రిటీని.. అది కూడా స్టేజీపై తిట్టడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. మరి రాజేంద్ర ప్రసాద్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.