RAP022

RAPO22: టైటిల్ గ్లింప్స్ కి డేట్, టైం ఫిక్స్.!

 RAPO22: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరోసారి తనదైన స్టైల్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మాస్ సినిమాలతో ఊరమాస్ చేసిన రామ్, ఇప్పుడు తన 22వ చిత్రంతో క్లాస్ జోనర్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. దర్శకుడు మహేష్ బాబుతో ప్లాన్ చేసిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ నెలకొంది. తాజాగా, మేకర్స్ ఈ చిత్రం టైటిల్, గ్లింప్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

Also Read: Sriya Reddy: ఓజి’ సెట్స్‌లో సందడి: ‘సలార్’ బ్యూటీ ఎంట్రీ?

RAPO22: మే 15 అనగా రేపు ఉదయం 10:08 గంటలకు టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను రివీల్ చేయనున్నారు. ఈ టైటిల్ ఏమిటన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించనుంది, మెర్విన్ సోలోమోన్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, రామ్ ఫ్యాన్స్‌కు కొత్త అనుభవాన్ని అందించనుంది. రేపటి అప్డేట్ కోసం రామ్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

WordsCharactersReading time

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *