Dark Circles

Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలా? క్రీములు పెట్టడం కాదు ఇలా చేయండి..!

Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలు (Dark Circles)ని పెరియోర్బిటల్ హైపర్‌పిగ్మెంటేషన్ (POH) అని కూడా అంటారు. ఈ సమస్య చర్మాన్ని ముదురు గోధుమ లేదా నీలం రంగులోకి మారుస్తుంది. కొంతమందికి కళ్ల కింద గుంటలు పడటం వల్ల కూడా నీడలు ఏర్పడి అవి డార్క్ సర్కిల్స్‌లా కనిపిస్తాయి. మార్కెట్లో దొరికే క్రీములు, సీరమ్‌లు కొంతవరకు సహాయపడినా, లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకోకుండా వీటిని శాశ్వతంగా దూరం చేయడం కష్టమే అనవచ్చు.డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవడానికి మీరు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు ఇవే:

1. నిద్రతోనే అసలు చికిత్స

బయట దొరికే క్రీములు వాడేముందు ఇంకో విషయం కూడా తెలుసుకుంటే మంచిది, అదే మీ శరీరానికి తగినంత విశ్రాంతిని ఇచ్చి లోపలి నుండి కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. వీలైనంత వరకు రాత్రి 10 గంటల లోపు నిద్రపోవడానికి ప్రయత్నిస్తే మీకు కావాల్సిన నిద్ర దొరుకుతుంది. దీనివల్ల మన శరీరం లోపలి నుండి రిపేర్ చేసుకుంటుంది. అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, దీనివల్ల కళ్ల కింద వాపు దూరం అవుతుంది.

2. స్క్రీన్ సమయంపై నియంత్రణ

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి వెలువడే కాంతి కళ్లపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది.

  • డిజిటల్ డిటాక్స్: నిద్రపోయే రెండు గంటల ముందే ఫోన్‌ను పక్కన పెట్టండి. చీకటి గదిలో స్క్రీన్లు చూడటం అస్సలు మంచిది కాదు.

  • కళ్లకు విశ్రాంతి: పని మధ్యలో కళ్లకు విరామం ఇవ్వండి. చల్లటి నీటితో కళ్లను కడగడం లేదా కీర దోసకాయ ముక్కలు, చల్లటి పత్తి (కాటన్) కళ్లపై ఉంచుకోవడం వల్ల కళ్లు సేదతీరుతాయి.

3. పోషకాహారం మరియు హైడ్రేషన్

శరీరంలో పోషకాల లోపం ఉన్నప్పుడు చర్మం పాలిపోయి, నల్లటి వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి.

  • ఆహార మార్పులు: జంక్ ఫుడ్‌ను పక్కన పెట్టి.. పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ మరియు విత్తనాలను (Seeds) మీ డైట్‌లో చేర్చుకోండి.

  • నీటి శాతం: డీహైడ్రేషన్ వల్ల కళ్ల కింద చర్మం నిర్జీవంగా మారుతుంది. రోజుకు సరిపడా నీటితో పాటు కొబ్బరి నీరు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలి.

  • మసాజ్: కళ్ల కింద ప్రాంతాన్ని బాదం నూనె లేదా ఆముదంతో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి నలుపు తగ్గుతుంది.

4. అలవాట్లను మార్చుకోండి

మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు చర్మంపై మచ్చలు రావడానికి, కళ్ల కింద నలుపు పెరగడానికి ప్రధాన కారణాలు. ఇవి శరీరంలోని కొల్లాజెన్‌ను దెబ్బతీస్తాయి. ఈ అలవాట్లను మానుకుంటే చర్మ సౌందర్యంతో పాటు మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *