తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. గురువారం ఉదయం వాయువ్య దిశగా పయనించి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో పూరీ, సాగర్ దీవుల మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాది జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
శుక్రవారం తెల్లవారుజామున ఒడిశాలోని భితార్కానికా నేషనల్ పార్క్, ధామ్రా ఓడరేవుల మధ్య గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు కూడా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. మాతోవైపు తుఫాన్ కారణంగా ఈ నెల 24, 25 తేదీల్లో ఈస్టర్న్, సౌతర్న్ రైల్వేలో 150 రైళ్లను అధికారులు రద్దు చేశారు.