Dana Cyclone Update

Dana Cyclone Update: ఆరు రాష్ట్రాల్లో ప్రభావం చూపించనున్న దానా తుపాను!

Dana Cyclone Update: అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన దానా తుపాను వేగంగా తీరంవైపు దూసుకువస్తోంది. ఈ తుపాను పెను తుపానుగా మారి ఒడిశాలోని పూరీ జిల్లా , పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం (దక్షిణ 24 పరగణాల జిల్లాలో) మధ్య అక్టోబర్ 24 రాత్రి నుండి అక్టోబర్ 25 ఉదయం మధ్య ఎప్పుడైనా తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుపాను ప్రభావం ఒడిశా రాష్ట్రంపై తీవ్రంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒడిశాలో చాలా ప్రాంతాలకు రెడ్ ఎలర్ట్ ప్రకటించి విపత్తును ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ తుపాను ప్రభావం ఒడిషాతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లోనూ ఉండే ఛాన్స్ ఉందని చెబుతున్నారు అధికారులు 

ఈ రాష్ట్రాల్లో దానా ప్రభావం ఎలా ఉండొచ్చంటున్నారంటే.. 

Dana Cyclone Update: ఒడిశా: ఒడిశాలోని 30 తీర ప్రాంత జిల్లాల్లో 14 జిల్లాల్లో తుపాను ప్రభావం విస్తృతంగా పడే అవకాశం ఉంది . అంగుల్, నయాఘర్, బాలాసోర్, మయూర్‌భంజ్, భద్రక్, కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్, కెందుజార్, జాజ్‌పూర్, కటక్, ధెంకనల్, ఖోర్ధా, గంజాం మరియు పూరీ జిల్లాల్లో అక్టోబర్ 24 నుండి 26 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.

Dana Cyclone Update: అక్టోబరు 24న పూరి, ఖుర్దా, గంజాం మరియు జగత్‌సింగ్‌పూర్ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షపాతం (7 నుండి 20 సెం.మీ.) వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదే సమయంలో, బాలేశ్వర్, మయూర్‌భంజ్, జాజ్‌పూర్‌లలో అతి భారీ వర్షం (21 సెం.మీ కంటే ఎక్కువ) కురిసే అవకాశం ఉంది.

పశ్చిమ బెంగాల్: తూర్పు మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్, దక్షిణ 24 పరగణాలు మరియు ఉత్తర 24 పరగణాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, కోల్‌కతా, హౌరా, హుగ్లీ , జార్గ్రామ్‌లలో అక్టోబర్ 23 – 24 మధ్య భారీ వర్షాలు కురుస్తాయి.

ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో గంటకు 30 నుండి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. 

Dana Cyclone Update: కర్నాటక: తుపాను రాకముందే కర్ణాటకలో భారీ వర్షాలు వరదల వంటి పరిస్థితులను సృష్టించాయి. బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. రాబోయే రెండు రోజుల్లోనూ కర్ణాటకలో వర్షాలు పడే అవకాశం ఉంది. 

తమిళనాడు- పుదుచ్చేరి: దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, తూర్పు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *