Horoscope Today: నేడు బుధవారం (మార్చి 11, 2026) ద్వాదశ రాశుల వారి జాతక గమనాన్ని పరిశీలిస్తే, గ్రహ సంచారం పలు రాశుల వారికి అత్యంత అనుకూలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మిథున, తుల, వృశ్చిక రాశుల వారికి ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మేష రాశి వారికి ఆదాయం పెరిగినప్పటికీ, వృథా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి పూర్తి ఫలితాలు ఇక్కడ చూడవచ్చు.
మేషం (Aries):
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థికాభివృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం పెరిగినప్పటికీ, వృథా ఖర్చులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.
వృషభం (Taurus):
ఉద్యోగంలో శుభ వార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
మిథునం (Gemini):
ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. అయితే, ఇతరులకు అనవసరమైన సహాయాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
కర్కాటకం (Cancer):
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన పనుల విషయంలో ఇతరులపై ఆధారపడవద్దు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
సింహం (Leo):
ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పిల్లలు చదువులో ఘనవిజయాలు సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్త.
కన్య (Virgo):
ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.
తుల (Libra):
ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. ఇష్టమైన ఆలయాలను దర్శించుకుంటారు. ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.
వృశ్చికం (Scorpio):
వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న లాభాలు వస్తాయి. నిరుద్యోగులు ఆశించిన శుభ వార్తలు వింటారు. పాత బాకీలను వసూలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
ధనుస్సు (Sagittarius):
ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది. సొంత నిర్ణయాలే మీకు శ్రీరామరక్ష. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన ఆర్థిక ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది.
మకరం (Capricorn):
అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో చేసే మార్పులు లాభాలనిస్తాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా ఉండటం మంచిది.
కుంభం (Aquarius):
మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మీనం (Pisces):
ఉద్యోగంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. అయితే, ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
