Horoscope Today: మేష రాశి: ఈరోజు మీ నిబద్ధతే మిమ్మల్ని కాపాడుతుంది. తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉంటే మంచి ఫలితాలు దక్కుతాయి. బంధువులతో ప్రేమగా ఉండాలి. మిమ్మల్ని తక్కువ చేసే వారు ఎదురైనప్పుడు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది.
వృషభ రాశి: దైవానుగ్రహం వల్ల మీరు ఒక ముఖ్యమైన పనిలో ఊహించని విజయాన్ని అందుకుంటారు. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగండి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. దుర్గాదేవిని దర్శించుకోవడం శుభకరం.
మిథున రాశి: మీ లక్ష్యాల పట్ల స్పష్టతతో పనిచేస్తారు. అనవసరమైన ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనసు ఆందోళన చెందకుండా చూసుకోవాలి. శివారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కర్కాటక రాశి: ఈరోజు మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మనసు పెట్టి పనిచేస్తే ఏ రంగంలోనైనా విజయం మీదే. మిత్రుల సహకారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
సింహ రాశి: మీకు ఈరోజు ఫలితాలు మధ్యమంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు. ఒక వార్త మీకు కొంత బాధ కలిగించవచ్చు. ఒత్తిడికి లోనుకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. నవగ్రహ స్తోత్రం చదువుకోవడం ఉత్తమం.
కన్య రాశి: ఈరోజు మీకు చాలా శుభప్రదంగా గడుస్తుంది. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సూచనలు మీకు విజయాలను తెచ్చిపెడతాయి. గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
తుల రాశి: మీకు ఇప్పుడు శుభకాలం నడుస్తోంది. సమయాన్ని వృథా చేయకుండా మంచి పనులకు కేటాయించండి. అభివృద్ధి దిశగా కొత్త ఆలోచనలు చేస్తారు. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఇష్టదైవ ప్రార్థన చేయడం శ్రేయస్కరం.
వృశ్చిక రాశి: బద్ధకాన్ని వదిలి పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధిస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. అయితే, కీలక విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. శనికి తైలాభిషేకం చేయడం వల్ల దోషాలు తొలగుతాయి.
ధనుస్సు రాశి: అందరినీ కలుపుకొని పోవడం వల్ల పనులు సులభమవుతాయి. ఆత్మీయుల సలహాలు మీకు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల మీ ఆత్మాభిమానం దెబ్బతినవచ్చు, కానీ వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం శుభప్రదం.
మకరం రాశి: ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజంలో పేరున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం వల్ల మేలు జరుగుతుంది.
కుంభ రాశి: చక్కటి ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ముఖ్యమైన పనుల్లో సహోద్యోగుల లేదా తోటివారి సహాయం అందుతుంది. శివారాధన మీకు శుభాన్ని ఇస్తుంది.
మీనం రాశి: ఈరోజు మీ ఓర్పుకు పరీక్షా కాలం. అనవసర నిందలు పడాల్సి రావచ్చు, కాబట్టి ఆలోచించి మాట్లాడాలి. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. సరైన ప్రణాళికతో పనులు చేస్తే విజయం సాధించవచ్చు. శ్రీరామరక్షా స్తోత్రం పఠించడం వల్ల రక్షణ కలుగుతుంది.
