Horoscope Today:

Horoscope Today: ఈరోజు మీ రాశికి ఎలా ఉంది? ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

Horoscope Today: మార్చి 28, 2026, శనివారం నాటి ద్వాదశ రాశుల ఫలితాలు సామాన్యుల నుండి వ్యాపారుల వరకు అందరికీ ఆసక్తికరంగా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు మేష రాశి వారికి ఊహించని ధన లాభం కలగడమే కాకుండా దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు,వృషభ రాశి వారికి రోజంతా అత్యంత సానుకూలంగా ఉండి, తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది.మిథున రాశి నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి ఉద్యోగ సమాచారం అందే అవకాశం ఉంది. 12 రాశుల వారి పూర్తి ఫలితాలు ఇప్పుడు చూద్దాం.

మేషం: ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉండబోతోంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెండింగ్ పనులు వేగంగా పూర్తవుతాయి. ఊహించని విధంగా ధన లాభం కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

వృషభం: రోజంతా సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. అయితే, ఆదాయం బాగున్నా అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం.

మిథునం: మీలోని ప్రతిభకు సరైన గుర్తింపు లభించే సమయం ఇది. కార్యాలయాల్లో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

కర్కాటకం: ఉద్యోగ రీత్యా బాధ్యతలు పెరుగుతాయి. దీనివల్ల కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

సింహం: ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మేలు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

కన్య: ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల నుంచి సానుకూల స్పందన వస్తుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా సంతోషకరంగా ఉంటుంది.

తుల: మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ఒక ముఖ్యమైన కార్యాన్ని పూర్తి చేస్తారు.

వృశ్చికం: వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

ధనుస్సు: ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించే వారికి ఇది సరైన సమయం. బంధువులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మాట తీరులో జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి.

మకరం: అధికారుల అండదండలు లభిస్తాయి. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో అంచనాలకు మించిన లాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి.

కుంభం: పాత బాకీలు వసూలవుతాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, ఇవి భవిష్యత్తులో మీకు ఎంతో ఉపకరిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది.

మీనం: ఉద్యోగంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. తక్కువ శ్రమతోనే ఎక్కువ ఫలితాలను సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *