Horoscope Today

Horoscope Today: ఈ రాశివారికి పండగే.. ప్రతిదాంట్లో లక్ నీ సొంతం..!

Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహగతులు, నక్షత్రాల స్థితి ఆధారంగా మన రోజువారీ జీవితంలో మార్పులు సంభవిస్తుంటాయి. నేడు మార్చి 14, శనివారం నాటి రాశిఫలాలను పరిశీలిస్తే, మేషం, వృషభం మరియు మిథున రాశుల వారికి వృత్తి, ఉద్యోగాల్లో అత్యంత అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేష రాశి వారికి బాధ్యతలు పెరిగే అవకాశం ఉండగా, వృషభ రాశి వారు అదనపు పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మిథున రాశి వారిపై అధికారుల నమ్మకం మరింత పెరుగుతుంది. 12 రాశుల వారి జాతకం వివరంగా కింద చూడవచ్చు.

మేషం: ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం: అదనపు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మిథునం: అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తిలో లాభాలు పెరుగుతాయి. అయితే, ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. సొంత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది.

కర్కాటకం: వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

సింహం: అధికారుల నుంచి అండదండలు లభిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కన్య: అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గృహ, వాహన రుణాలకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు సంభవిస్తాయి.

తుల: ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. దూర ప్రాంతం నుంచి పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది.

వృశ్చికం: ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.

ధనుస్సు: అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి కలుగుతుంది. వాహన యోగం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది.

మకరం: అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. రాబడికి లోటుండదు. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి పురోగతి సాధిస్తారు.

కుంభం: పని భారం పెరుగుతుంది. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి షేర్లు, స్పెక్యులేషన్ల జోలికి పోవద్దు.

మీనం: మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు ఆఫర్ సమాచారం అందుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *