కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.డీఏ పెంపుతో కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 3 శాతం డీఏ పెంపుతో ఉద్యోగుల డియర్నెస్ అలొవెన్స్ 50 శాతం నుంచి 53 శాతానికి చేరనుంది.
డీఏ పెంపు ప్రకటన అక్టోబర్ చివరిలో వస్తే.. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల బకాయిలతో కలుపుకుని జీతం అందుతుంది.కాగా ఏడాదికి రెండుసార్లు ప్రభుత్వ ఉద్యోగులకు ,పెన్షనర్లకు డీఏ ఇస్తారు.ఈ ఏడాది మార్చిలో డీఏ 4శాతం పెరిగింది. మళ్లీ ఇప్పుడు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.