Cyber scam: జనాలని ఎట్లా మోసం చేయాలని రోజుకో కొత్తదారి వెతుక్కుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. మనుషులని ఎలా బుట్టలో వేసుకోవాలి వారి నుంచి డబ్బులు ఎలా లాగానే దానిమీద పీహెచ్డీలు చేస్తున్నారు. రోజుకో విధంగా ఘరానా మోసం చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. మీరు బారిన పడకుండా ఉండకు ప్రభుత్వాలు పోలీసులు ప్రజలకు ఎంత చెప్పినా గాని ఏదో ఒక విధంగా ఈ మాయగాల్ల మూటలో పడిపోతున్నారు. సైబర్ నేరగాళ్లు జనాన్ని మోసం చేసేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు.
తాజాగా, హైదరాబాద్ లోని బాచుపల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేరు ఉద్యోగి ఫోన్ నెంబర్ సైబర్ నేరగాళ్లు కేఎస్ఎల్ అఫీషియల్ స్టాక్ పేరుతో క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు.అయితే, ఆ గ్రూప్‌లో తమ వద్ద పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వస్తుంది మెసేజ్‌లతో నమ్మబలికారు. అనంతరం కొటక్ ప్రో యాప్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వారిని నమ్మిన ఐటీ ఉద్యోగి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి కస్టమర్ కేర్ సూచన మేరకు అందులో 2.29 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాడు. మొదట బాధితుడికి రూ.1.10 కోట్ల లాభం వచ్చినట్లుగా నమ్మించి మొత్తం.. అకౌంట్ ఉన్న రూ.3.3 కోట్లు విత్ డ్రా చేసుకోవాలంటే ఇంకో రూ.40 లక్షలు కట్టాలని చెప్పారు.
దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న సదరు సాఫ్ట్‌వేరు ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులు నరేష్ శిందే, సౌరభ్ శిందేలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులు అంతా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.