Cyber Criminal Escape:ఢిల్లీలో తెలంగాణ పోలీసులు తెలిసి చేశారా? తెలియక చేశారో? కానీ, చేతికి దొరికిన ఓ సైబర్ నేరగాడిని చేజేతులా జార విడుచుకున్నారు. ఇటీవల సైబర్ మోసాలు పెరుగుతున్న దృష్ట్యా నేరగాళ్లను పట్టుకోవడంలో, సొమ్ము రికవరీలో దేశంలోనే తెలంగాణ సీసీఎస్ పోలీసులకు మంచి ట్రాక్ రికార్డు ఉన్నది. మరి తాజా ఘటనలో చిన్న లాజిక్‌ను మిస్ అవడంతో తెలంగాణ పోలీసులను బురిడీ కొట్టి ఆ సైబర్ నేరగాడు పారిపోయాడు.
Cyber Criminal Escape:ఇటీవల తెలంగాణలో వివిధ వర్గాల నుంచి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని కోట్లల్లో సొమ్మును పోగొట్టుకున్న వారి నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఆ మేరకు ఉత్తరాదికి చెందిన సైబర్ నేరస్తుల ఆట కట్టేందుకు తెలంగాణ సీసీఎస్ సీఐ నరేశ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులు కలిగిన పోలీస్ బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లింది. ఢిల్లీ కేంద్రంగా సైబర్ ముఠాను వేటాడే పనిలో పడింది.
Cyber Criminal Escape:తెలంగాణ సీసీఎస్ పోలీస్ బృందం పన్నిన వలలో ఎట్టకేలకు ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్న దినేష్ అనే సైబర్ నేరగాడు ఆదివారం రాత్రి పట్టుబడ్డాడు. అతడిని అరెస్టు చేసి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు తరలించారు. అక్కడే బస చేశారు. ఉదయం నిందితుడితో కలిసి కొందరు పోలీసులతో పంపించాల్సి ఉన్నది. ఈలోగా ఆ సైబర్ నేరగాడు ఓ పన్నాగం పన్నాడు. అర్ధరాత్రి పూట టాయిలెట్‌కు వెళ్లాలని పోలీసులకు చెప్పి వెళ్లాడు. ఈ సమయంలో వారి కళ్లుగప్పి చూస్తుండగానే పరారయ్యాడు.
Cyber Criminal Escape:అయితే ఇక్కడే తెలంగాణ సీసీఎస్ పోలీస్ బృందం చిన్న లాజిక్‌ను మరిచింది. ఇతర రాష్ట్రాల్లో ఏ నిందితుడిని అయినా అదుపులోకి తీసుకుంటే తొలుత అక్కడి కోర్టులో హాజరు పరిచి, ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా సొంత రాష్ట్రానికి తరలించాల్సి ఉంటుంది. కానీ, పోలీసులు అలా చేయకుండా తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లడంపై విస్మయం వ్యక్తమవుతుంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది.