Bank Holidays: సాధారణంగా బ్యాంకులకు నెల నెలా ఆదివారాలు, రెండు, నాలుగు శనివారాలు సెలవులు ఉంటాయి. వాటితో పాటు పండుగల సెలవులు కూడా ఉంటాయి. అంటే కచ్చితంగా నెలలో ఆరు రోజులు బ్యాంకులు పని చేయవు. దీంతో పాటు ఒకటి రెండు రోజుల అదనంగా ఏవో సెలవులు ఉంటూనే ఉంటాయి. ఈ నెలలో కూడా హొలీ సెలవు వచ్చింది. ఇక మరో రెండు సెలవులు కూడా అనుకోకుండా రాబోతున్నాయి. బ్యాంకు ఎంప్లాయిస్ సమ్మె కారణంగా ఈ రెండు సెలవులు వస్తున్నాయి.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె, నిరంతర సెలవుల కారణంగా బ్యాంకులు 4 రోజులు మూతపడే ప్రమాదం ఉంది. వివిధ డిమాండ్లను ముందుకు తెస్తూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మార్చి 24 – 25 తేదీలలో 48 గంటల సమ్మెను ప్రకటించింది. ఈ నిరసనలో 8,00,000 మంది పాల్గొంటారని అంచనా.
ఇది కూడా చదవండి: Delhi: ఖాతాలో 2500 పడతాయి..కానీ షరతులు వర్తిస్తాయి
ఈ సమ్మె ప్రకటనతో, బ్యాంకింగ్ కార్యకలాపాలు 4 రోజుల పాటు అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. ప్రతి నెలా 2వ – 4వ శనివారం సెలవు. మార్చి 22 ఈ నెల 4వ శనివారం. మరుసటి రోజు (మార్చి 23) ఆదివారం సెలవు.
సమ్మె ప్రకటించిన మార్చి 24 – 25 తేదీలలో బ్యాంకులు పనిచేయవు. ఆ విధంగా, మొత్తం 4 రోజులు బ్యాంకులలో ఎటువంటి సేవ ఉండదు.
బ్యాంకులు వరుసగా 4 రోజులు తెరుచుకోవు. కాబట్టి, ఖాతాదారులు ముందుగానే నగదు లావాదేవీలు చేసుకోవాలని బ్యాంకుల ఉద్యోగులు సూచించారు.