Currency Notes: నల్లగొండ జిల్లాలో ఓ రైతు పొలంలో నోట్ల కట్టల కుప్ప కలకలం రేపింది. అన్నీ 500 నోట్ల కట్టలు సీల్‌తో సహా ఉండటం గమనార్హం. వాటిపై ఓ బ్యాంకు పేరు కూడా ఉన్నది. ఓ హైవేపై పక్కనున్న పొలంలో ఈ నోట్ల కట్టలు పేర్చి దర్శనమియడంతో సోమవారం ఉదయం వాటిని గుర్తించారు. వాటిలో కొన్నింటిని స్థానికులు కొందరు తీసుకెళ్లగా, ఇంకా అక్కడే మరికొన్ని ఉన్నాయి. అయితీ ఈ విషయం పోలీసులకు చేరింది.
Currency Notes: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి వెంట బొత్తలపాలెం గ్రామ సమీపంలో ఉన్న ఓ వరి పొలంలో రూ.500 నోట్ల కట్టలు 40 వరకు ఉన్నాయి. ఆ విషయం తెలిసిన పోలీసులు మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మిగతా నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అవి రూ.20 లక్షల వరకు ఉంటాయని తెలుస్తున్నది.
Currency Notes: పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ నోట్ల కట్టలపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉన్నట్టు గుర్తించారు. అవి అక్కడికి ఎలా వచ్చాయి, ఎవరు తెచ్చి పడేశారు, తీసుకెళ్లిన వారి వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ నోట్లు అన్నీ నకిలీవని తేలిందని, విశ్వసనీయ సమాచారం మేరకు నోట్లను ముద్రించిన వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. ఆ నకిలీ నోట్లను ఎందుకు చెలామణి చేస్తున్నారని, ఎక్కడెక్కడ చేశారన్న వివరాలను రాబడుతున్నారు.

