CRPF Jawan Commits Suicide:దేశానికి సేవ చేసేందుకు వెళ్లిన ఆర్మీ జవాన్‌కు అష్టకష్టాలు చుట్టుముట్టడంతో ఆయువు తీసుకున్నాడు. ఆనందంతో గడిపేందుకు ప్రేమ వివాహం చేసుకున్న అతను అంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. పిల్లలను మంచిగా చదివించుకోవాలని తపన పడిన ఆ తండ్రి తనువు చాలించాడు. తండ్రికి వచ్చిన జబ్బును నయం చేయించేందుకు తనువెళ్లా కష్టపడిన ఆ కొడుకు అర్ధాంతరంగా అంతర్థానం అయ్యాడు. ఇన్ని ఆశలు ఆశయాలు ఉన్న ఆ ఆర్మీ జవాన్‌ను అప్పులు చుట్టుముట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
CRPF Jawan Commits Suicide:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం శివపురం కొట్టాలకు చెందిన కంచుకుంట మురళి (30) 2017 నుంచి సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఐదేండ్ల క్రితమే లోకపావని అనే యువతిని మురళి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ తారక్‌రామ్ (4) అనే కుమారుడు, మహి (2) కుమార్తె కలిగారు.
CRPF Jawan Commits Suicide:మురళి తండ్రి ముత్యాలన్నకు చర్మసంబంధ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ చర్మ వ్యాధి చికిత్స కోసం మురళి సుమారు రూ.30 లక్షల వరకు అప్పు చేశాడు. ఇదిలా ఉండగా, ఇటీవలే మురళి కారును అతని స్నేహితుడు తీసుకెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. కారు నంబర్ ఆధారంగా కేసు నమోదైంది. ఆ కేసు రాజీ కోసం బాధిత కుటుంబం రూ.15 లక్షలు డిమాండ్ చేసింది. అందులో భాగంగా తండ్రి వైద్యం కోసం ఉంచిన రూ.4 లక్షలు ఇచ్చాడు.
CRPF Jawan Commits Suicide:ఇలాంటి పరిస్థితుల్లోనే మురళి చెల్లి పెళ్లీడుకొచ్చి ఉన్నది. ఆమెకు పెళ్లి చేయాల్సి ఉన్నది. ఇప్పటికే రూ.34 లక్షల అప్పులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్మీ జవాన్ మురళి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన భార్య లోకపావనితో మురళి తాను పనిచేసే చోటు నుంచి మాట్లాడుతూనే గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమయంలో మురళి మాట్లాడిన విషయాలు విన్న ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టించకమానవు.
CRPF Jawan Commits Suicide:”పావని తిన్నావా.. పిల్లలు తిన్నారా? నాన్నను బాగా చూసుకోవాలి. చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. పిల్లలను బాగా చదివిద్దాం. ఇప్పటికే రూ.34 లక్షలు అప్పులు చేశా. నువ్వు మన కుటుంబానికి అండగా ఉండు” అంటూ తన భార్యతో మాట్లాడుతూనే మురళి తన గన్‌తో కాల్చుకున్నాడు.

