Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. కలియుగ వైకుంఠంలో స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు.
ప్రస్తుతం, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులతో మొత్తం 14 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేకుండా స్వామివారి సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు సుమారు 8 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారికి తాగునీరు, పాలు, ఆహారం వంటి సౌకర్యాలను అందజేస్తున్నారు. అలాగే, స్వామివారిని దర్శించుకునేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున, భక్తులు ఓపికగా సహకరించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

