Pakistan: పాకిస్థాన్ దేశంలో ఏదో ఒక చోట నరమేధం సాధారణమై పోయింది. గురువారం అర్ధరాత్రి దాటాక ముష్కరుల దాడిలో 20 మంది అభం శుభం తెలియని చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆ దేశంలోని నైరుతి పాకిస్థాన్‌లో ఉన్న బలూచిస్థాన్ ప్రావిన్స్ పరిధిలో దుకీ జిల్లాలోని బొగ్గు గని వద్ద ఉన్న వసతి గృహాల్లోకి ముష్కరులు చొరబడ్డారు. ముష్కరులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 20 మంది మైనర్లు ప్రాణాలిడిచారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్ఘానిస్థాన్ పౌరులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.