Crime News

Crime News: మద్యం మత్తులో తల్లిని చంపిన తనయుడు..

Crime News: కష్టపడటానికి ఇష్టం లేని కొందరు వ్యక్తులు కన్న తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టారు. వారి సంపాదించిన ఆస్తి కోసం కన్నేశారు. ఇవ్వనని మొండి కేస్తే చంపేయడం కొడుకుల వంతైంది. ఇలాంటి ఈ ఘటనలు దేశంలో ఏదో ఒక మూలన జరుగుతూనే ఉంటున్నాయి. లేటెస్టుగా శంషాబాద్‌లో అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.

ఆస్తి కోసం తల్లిని అతి దారుణంగా చంపేశాడు కన్న కొడుకు. శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డులో ఉంటోంది రాచమల్ల చంద్రకళ. ఆమె వయస్సు 55 ఏళ్లు. ఆమెకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె కొడుకు వద్దే ఉంటోంది. అయితే పెద్దకొడుకు రాచమల్ల ప్రకాష్‌‌కి 38 ఏళ్లు.

గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలీదు. కొన్నాళ్ల కిందట మూడో పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం నుంచి శంషాబాద్ మున్సిపాలిటీలోని రాఘవేంద్రకాలనీలో చంద్రకళకు 100 గజాల్లో ఇళ్లు ఉంది. ఆ ఇంటిని అన్నదమ్ములకు పంచి ఇవ్వాలని తల్లిని నిత్యం వేధిస్తున్నాడు పెద్ద కొడుకు ప్రకాష్‌.

Also Read: Kidnap Case: పాఠ‌శాల‌ల బాలికలే టార్గెట్‌.. కళ్లు బైర్లు క‌మ్మే కిలేడీ దారుణాలు

Crime News: జులాయిగా తిరగడానికి ఇష్టపడిన ప్రకాశ్, ఆ తర్వాత చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఎప్పుడు చూసినా మద్యం మత్తులో కనిపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు సైతం లేకపోలేదు. రాత్రి పుల్‌గా మద్యం పుచ్చుకున్నాడు. ఆ మత్తులో ఆస్తి కోసం తల్లితో గొడవపడ్డాడు.

దీంతో ఆగ్రహానికి లోనైన ప్రకాష్, తల్లి తలను గ్యాస్ సిలెండర్ గట్టిగా మోదాడు. ఆ తర్వాత కట్టెలతో తలపై గట్టిగా కొట్టడంతో తీవ్ర గాయాలు పాలైంది. కాసేపటికి ఆమె స్పృహ కోల్పోయింది. అక్కడ రక్తపు మడుగులో పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.చంద్రకళను వెంటనే చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. పోస్టుమార్ఠం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తల్లిని చంపిన ప్రకాశ్‌ను ఆదుపులోకి తీసుకున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ys Sharmila: కేసీఆర్, జగన్ ఇద్దరూ కలిసి నా ఫోన్లు ట్యాప్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *