Crime News:క్షమించరాని దారుణాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.. కన్నపేగును కడతేరుస్తున్నాయి.. కంటిరెప్పలా కాపాడుకోవాల్సిన కంటిపాపను కాలరాస్తున్నాయి.. ఇటీవల వరుస ఘటనలతో సభ్య సమాజం ఆందోళనకు గురవుతున్నది. ఈ సమాజం ఎటు పోతున్నదని ప్రశ్నించుకుంటున్నది.
Crime News:కడుపున పుట్టిన పిల్లలను దారుణాతి దారుణంగా చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. అయినా ఆ దారుణాలు ఆగడంలేదు. ఇక్కడ తన కడుపున పుట్టిన పసికందును తన తల్లితో కలిసి ఓ మహిళ కడతేర్చిన ఘటన చోటుచేసుకున్నది. కూతురు ప్రేమ వివాహాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఆమె తల్లి కూడా ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ఏపీలోని కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీలో చోటుచేసుకున్నది.
Crime News:పిఠాపురం పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీకి చెందిన శైలజ.. అదే మండలం నరసింగపురానికి చెందిన సతీశ్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. కొద్దికాలం క్రితం శైలజ తన పుట్టింటికి వచ్చింది. ఐదు నెలల క్రితమే యశ్విత అనే పసిబిడ్డకు జన్మనిచ్చింది.
Crime News:ఈ లోగా శైలజ ప్రేమ వివాహం నచ్చని ఆమె తల్లి అన్నవరం భర్తకు వద్దకు పంపకుండా చేసింది. కూతురును మనసును విరిచేసింది. ఈలోగా సొంత కులానికి చెందిన ఓ వ్యక్తితో రెండో వివాహం చేసేందుకు తల్లీకూతుళ్లు నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో ఐదు నెలల పసికందు యశ్విత అడ్డు తొలగించుకోవాలని ఆ తల్లీకూతుళ్లు దుష్టపన్నాగం పన్నారు.
Crime News:మే నెల 6వ తేదీన కనికరం లేని ఆ తల్లీకూతుళ్లు పసికందు గొంతునులిపి చంపేసి ఇంటి పక్కనే ఉన్న బావిలో పడేశారు. తర్వాత ఎవరో తమ ఇంటికి క్షుద్రపూజలు చేసి చిన్నారిని చంపేశారని ఇంటి ముందు ముగ్గు వేసి, నిమ్మకాయలు పెట్టి నమ్మించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం వెల్లడైంది. తామే ఆ పసికందును చంపినట్టు అన్నవరం, శైలజ ఒప్పుకున్నారు.