Crime News:వివాహేతర బంధాలు కాట్ల కలుస్తున్నాయడానికి ఈ ఘటన కూడా ఒక నిదర్శనమే. అయిన వాళ్లను కడతేర్చడానికీ వెనుకాడని వైనం ఇక్కడా జరిగింది. కట్టుకున్న భర్తను వదులుకోవడమే కాదు.. ఏకంగా జీవితమే లేకుండా చేసేందుకు ఈ మహిళ వెనుకాడ లేదు. వివాహేతర బంధమే ముఖ్యం అనుకున్న ఆ మహిళ తన భర్తను చంపి, ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్లాన్ చేసింది. పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు తేలాయి.
Crime News:వనపర్తి జిల్లా కేంద్రంలోని గణేశ్ నగర్ ప్రాంతంలో కురుమూర్తి, నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతానికి సమీపంలోని ఓ మాల్‌లో కురుమూర్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన కనిపించకుండా పోయాడు. దీనిపై అనుమానం వచ్చిన ఆయన సోదరి తన సోదరుడు కనిపించడం లేదని గత నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Crime News:కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మెట్‌పల్లికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తితో కురుమూర్తి భార్య నాగమణికి వివాహేతర బంధం ఏర్పడిందని నిర్ధారించారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించగా, తామే కురుమూర్తిని హత్య చేసినట్టు నాగమణి, శ్రీకాంత్ అంగీకరించారు. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడే హతమార్చినట్టు ఒప్పుకున్నారు.
Crime News:ఓ పథకం ప్రకారమే ఆయన్ని తీసుకెళ్లి హత్య చేశామని శ్రీకాంత్, నాగమణి తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని శ్రీశైలం డ్యామ్‌లో పడేసినట్టు నిందితులు తెలిపారు. కట్టుకున్న భర్తను కూడా వదిలించుకోవడానికి ఆ మహిళ దుర్మార్గానికి ఒడిగట్టడంపై సభ్య సమాజం విస్మయం వ్యక్తంచేస్తున్నది.

