Crime News:

Crime News: పోలీస్ పెట్రోల్ వాహ‌నాన్ని ఢీకొట్టిన లారీ.. ఒక కానిస్టేబుల్ దుర్మ‌ర‌ణం.. మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాలు

Crime News:హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారిపై శ‌నివారం అర్ధ‌రాత్రి త‌ర్వాత ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. ఆ జాతీయ ర‌హ‌దారిపై రంగారెడ్డి జిల్లా శంషాబాద్ స‌మీపంలో వాహ‌నాల‌ను త‌నిఖీ చేస్తున్న ఓ పోలీస్ పెట్రోలింగ్ వాహ‌నాన్ని వేగంగా దూసుకొచ్చిన‌ ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒక కానిస్టేబుల్ అక్క‌డిక్క‌డే మృతిచెంద‌గా, మ‌రో ముగ్గురు కానిస్టేబుళ్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి.

Crime News:శంషాబాద్ మండ‌లం షాపూరు హైవేపై ఎస్‌వీఆర్ ఫంక్ష‌న్ హాలు స‌మీపంలో జ‌రిగిన‌ ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదంలో విజ‌య్ కుమార్ అనే కానిస్టేబుల్ మృతి చెంద‌డంతో తీవ్ర విషాదం నెల‌కొన్న‌ది. తీవ్రంగా గాయాల‌పాలైన మ‌రో ముగ్గురు కానిస్టేబుళ్లును చికిత్స కోసం స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. లారీ డ్రైవ‌ర్ అతివేగంతో దూసుకురావ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జరిగిన‌ట్టు పోలీసులు తెలిపారు.

Crime News:ఈ ఘ‌ట‌న‌లో మృతిచెందిన కానిస్టేబుల్ విజ‌య్‌కుమార్ శంషాబాద్ పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వ‌హించేవారు. మిగ‌తా ముగ్గురు కూడా అక్క‌డే ప‌నిచేసేవారు. ఈ ముగ్గురిలో ఓ కానిస్టేబుల్ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది. పోలీస్ పెట్రోలింగ్ వాహ‌నాన్ని లారీ ఢీకొట్టిన ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Papaya Benefits: బొప్పాయి తింటే ఈ వ్యాధులు రావు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *