Crime News:వివాహేతర బంధాలతో కుటుంబ బంధాలు దూరం అవుతున్నాయి. ఇటీవల ఈ జాఢ్యం పెరిగింది. కట్టుకున్న వాడిని, పిల్లలను వదిలి వివాహేతర బంధానికి కొందరు విలువను ఇస్తుండటంతో అలాంటి ఇళ్లలో విభేదాలు పొడచూపి, చివరికి ప్రాణాలే పోతున్నాయి. భార్యాభర్తల బంధాలతో పాటు చిన్నారులు కూడా వారి పంతాలకు బలవుతున్నారు. ఇక్కడా అదే జరిగింది. తన భార్య వివాహేతర బంధం పెట్టుకున్నదన్న మనస్థాపంతో ఆమె భర్త తన కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Crime News:శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామానికి చెందిన దుప్పాడ సంతోష్‌కు ఇద్దరు భార్యలు. రెండో భార్య స్వాతిని ప్రేమ వివాహం చేసుకోగా, విశాఖలో వేర్వేరు ఇళ్లలో ఇద్దరు భార్యలతో నివసిస్తున్నారు. దసరా సెలవులు నేపథ్యంలో పెద్దపాడు గురుకుల పాఠశాలలో చదువుతున్న వారి కూతురు హైమా (11)ను తీసుకు రావడానికి స్వాతి వెళ్లింది.
Crime News:కూతురు తీసుకొచ్చేందుకు ఉదయం వెళ్లిన స్వాతి రాత్రి ఇంటికి వచ్చింది. ఆలస్యంగా ఎందుకు వచ్చావంటూ భర్త సంతోష్ స్వాతిని నిలదీశాడు. వేరే వ్యక్తితో కలిసి స్వాతి తిరిగిందని భర్తకు తెలిసి అడగటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ తన కూతురును తీసుకొని కలిసి బయటకు వెళ్లాడు.
Crime News:తాను చనిపోతే తన కూతురు ఆలనా పాలనా ఎవరు చూసుకుంటారోనని సంతోశ్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. విషం కొని తన కూతురుకు తాగించి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న రాత్రి తండ్రి, కూతురు చనిపోయారు. వివాహేతర బంధాలతో అభం శుభం తెలియని చిన్నారి హైమా కూడా ప్రాణాలను బలితీసుకున్నారు.